1
ఐఫోన్‌ 10 ఏళ్ల వార్షికోత్సవంగా ఆపిల్‌ తీసుకొచ్చిన ఐఫోన్‌ ఎక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. భారత్‌తో పాటు పలు దేశాల్లో ఈ ఫోన్‌ శుక్రవారం విక్రయానికి వచ్చింది. విక్రయానికి వచ్చిన ఈ ఫోన్‌ కోసం వినియోగదారులు ఎగబడ్డారు. దేశంలో అతిపెద్ద టెలికమ్యూనికేషన్‌ సర్వీసు ప్రొవైడర్‌ భారతీ ఎయిర్‌టెల్‌ కూడా తన ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌తో ఈ ఫోన్‌ను విక్రయించింది. సాయంత్రం ఆరు గంటలకు దీన్ని విక్రయానికి తీసుకురాగ, నిమిషాల వ్యవధిలోనే స్టాక్‌ అంతా అమ్ముడుపోయింది. పైగా ఈ ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా పోస్ట్‌-పెయిడ్‌ కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది.

Comments

Who Upvoted this Story